రారండోయ్ వేడుక చూద్దాం టైటిల్ సాంగ్ టీజర్

rarandoi veduka chuddam title song teaser released


 సోగ్గాడే చిన్ని నాయన సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’.. శనివారం తో షూటింగ్ పూర్తి చేసుకుంది. నిన్న సాయంత్రం టైటిల్ సాంగ్ టీజర్ ను విడుదల చేశారు.. టీజర్ చూస్తుంటే సినిమా పల్లెటూరి నైపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం అని తెలుస్తుంది. నాగ చైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య రొమాన్స్ కూడా చాలా బాగుంది.

టీజర్ లో వినపడే టైటిల్ సాంగ్ 'బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ' వింటే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు కావలసిన అన్ని హంగులతో.. మే26  వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags: #naga chaithanya, #rakul preth sing,

No comments